ఆంధ్రప్రదేశ్‌

రీపోస్టుమార్టమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: పనె్నండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు శనివారం ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య ఆద్వర్యం లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణుల బృందం గుంటూరు జిల్లా తెనాలిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. అవశేషాలను సేకరించి పరిశోధనల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని, పూర్తి వివరాలు, ల్యాబ్ ఫలితాలను త్వరలో కోర్టుకు అందజేస్తామని ఎస్పీ వివరించారు. 2007 డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలో హత్యకు గురైన ఆయేషా మీరా కేసును అప్పటి పోలీసులు విచారించి సత్యంబాబు
అనే నిందితుడిని 2008లో అరెస్టు చేసి కోర్టుకు హజరుపరచగా విజయవాడలోని మహిళా సెషన్స్‌కోర్టు అతడికి 14 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత హైకోర్టులో జరిగిన విచారణలో సత్యంబాబును 2017 మార్చి 31న నిర్దోషిగా తేల్చిన రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం ఎనిమిదేళ్ల జైలుశిక్ష తరువాత అతడిని విడుదల చేసింది. 2019లో ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో ఆయేషామీరా కేసు మరోమారు తెరపైకి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. మృతురాలి తల్లిదండ్రులు, స్నేహితులు, సంఘటన జరిగిన హాస్టల్ నిర్వాహకులను ఇప్పటికే విచారించింది. అయితే ఆయేషా మృతదేహానికి కూడా రీపోస్టుమార్టమ్ నిర్వహించేందుకు సహకరించాలని, తల్లిదండ్రులను కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 5.30 గంటలకు మతపెద్దలు, ఆయేషామీరా తండ్రి ఇక్బాల్ బాషా, స్థానిక పోలీసుల సహకారంతో సీబీఐ అధికారులు స్థానిక ఈద్గాలో ఆయేషాను ఖననం చేసిన స్థలానికి చేరుకుని దాదాపు తొమ్మిది గంటలపాటు రీపోస్టుమార్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతదేహానికి సంబందించి పుర్రె, ఆస్థికలు, అవసరమైన ఇతర అవశేషాలను సేకరించి, హైదరాబాద్‌లోని ఫోరెనిక్స్‌ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు తెలియజేసి వెళ్ళిపోయారు. కార్యక్రమాలను తెనాలి సబ్‌కలెక్టర్ కొత్తమాసు దినేష్‌కుమార్, తహశీల్దార్ రవిబాబు పర్యవేక్షించగా సీబీఐ బృందంలోని ఇతర సభ్యులు, అవశేషాలు సేకరించిన వైద్యుల వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.
*చిత్రం... రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్న సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు