ఆంధ్రప్రదేశ్‌

చర్చించాకే రాజధానిపై స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాజధాని అమరావతి విషయమై అసెంబ్లీలో చర్చించిన మీదటే స్పష్టతనిస్తామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని మార్పు అంటూ తాము ఎటువంటి ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. అయితే రాజధానిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించిన మీదటే స్పష్టత లభిస్తుందన్నారు. గత అయిదేళ్లుగా అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించారని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆదేశించారన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు వైసీపీ సభ్యులను దుర్భాషలాడుతూ సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. సమస్యలపై చర్చించకుండా రాజకీయాల కోసం అసెంబ్లీ వేదికను వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత అయిదేళ్ల టీడీపీ పాలన పూర్తి అవినీతిమయమని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం యావత్ దేశానికే ఆదర్శమని మంత్రి బొత్స అన్నారు. కఠిన చట్టాలు, సత్వర న్యాయంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిలకలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. విశాఖ నగరంలో మెట్రోరైల్ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నట్టు చెప్పారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సందిగ్ధత నెలకొందని, మరోసారి టెండర్లు పిలిచే ఆలోచన ఉన్నట్టు మంత్రి బొత్స స్పష్టం చేశారు.
*చిత్రం... మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ