ఆంధ్రప్రదేశ్‌

ఇంగ్లీష్ మీడియం తెచ్చింది మేమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 12: ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అమలులోకి తెచ్చింది తమ ప్రభుత్వమే అని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ‘జగన్ వస్తేనే ఇంగ్లీష్ వచ్చిందనే’ ప్రచారం వాస్తవం కాదన్నారు. తొలిసారిగా 2015 సెప్టెంబర్ 24న సర్వశిక్షాభియాన్ ద్వారా 253 టీవీలు పంపిణీచేసి ఆంగ్ల మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టామని
తెలిపారు. తరువాత 6500 సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశామని, ఈ మేరకు 3428 పాఠశాలల్లో అమల్లోకి తెచ్చామని వివరించారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలనే సంకల్పంతో ఏడాదికి కొన్ని పాఠశాలలను గుర్తించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. 2017లో ప్రభుత్వం బ్రిటీష్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకుందని లక్ష మందికి ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. ఇందులో 30 వేల మందికి శిక్షణ ఇచ్చారని చెప్పారు. అయితే అప్పట్లో మాతృభాష తెలుగుకు తూట్లు పొడుస్తున్నారని ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ వ్యతిరేకించారని పత్రికల్లో వచ్చిన వార్తలను సభ ముందుంచారు. జగన్ సొంత పత్రిక సాక్షిలో కూడా దీనిపై కథనాలు వచ్చాయన్నారు. అప్పుడు మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని వ్యతిరేకించారని ఎదురు ప్రశ్న వేశారు. ఇంగ్లీష్‌ను జగనే కనిపెట్టాడని చెప్పేలా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2015 అక్టోబర్ 5వ తేదీన అన్ని సంక్షేమ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అందుబాటులోకి తేవాలని ఆదేశాలిచ్చామని, తరువాత 2019 నవంబర్ 5వ తేదీన ప్రాథమిక విద్యను ఆంగ్లంలో బోధించాలని నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులిచ్చామన్నారు. ఇప్పుడేదో కొత్తగా ఆంగ్ల బోధన తెచ్చి పేదలను ఉద్ధరిస్తున్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఏ రకమైన ప్రచారం చేసుకున్నా రికార్డులు, ప్రింట్లు మార్చలేరని వ్యాఖ్యానించారు. జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరు అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షిలోనే ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ వార్తలు వచ్చాయి.. మేం అవినీతి డబ్బుతో పేపర్లు, చానళ్లు పెట్టుకోలేదని’ విమర్శించారు. అధికారంలో ఉంటే ఓ రకంగా.. లేకపోతే మరో రకంగా.. వ్యవహరించటం జగన్‌కే చెల్లిందన్నారు. తానొక్కడే మేధావి అయినట్లుగా ఎక్కడో చదువుకుని వచ్చానని అంటాడు.. అసలు ఎక్కడ చదివిందీ చెప్పడని విమర్శించారు. తాము 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నా టీఆర్‌ఎస్, వైసీపీ మాదిరిగా తనకు సొంత మీడియా లేదన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనకు తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. ముందుగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు దీనిపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. నైపుణ్యం, విజ్ఞానం సమతుల్యం కావాలన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారికి నచ్చిన మీడియంలో విద్యా బోధన నిర్వహించాలని డిమాండ్ చేశారు.
*చిత్రం...ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు