ఆంధ్రప్రదేశ్‌

ధరల పెరుగుదలపై వామపక్షాల నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: ఆర్టీసీ చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, ఉల్లిపాయల ధరలను నియంత్రించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోల వంటి నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. గుంటూరు, తిరుపతి, విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం, తదితర పలు కేంద్రాల్లో నిరసనలు జయప్రదంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని, అత్యధికంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించి, అందరికీ అందుబాటులోకి తేవాలని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను అదుపుచేసేందుకు తగు చర్యలు చేపట్టాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు.