ఆంధ్రప్రదేశ్‌

జీసీసీ డీఆర్ డిపోల నిర్వహణ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: సరసమైన ధరలకు నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నడిచే డొమెస్టిక్ రిక్వైర్‌మెంట్ (డీఆర్) డిపోల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. రానున్న రోజుల్లో ఇవి కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఇటు వినియోగదారులు, మరోపక్క జీసీసీ సంస్థ యాజమాన్యం సమస్యలు ఎదుర్కోక తప్పేటట్టులేదు. ముఖ్యంగా గిరిజన యువత ఉపాధి కోల్పోయే పరిస్థితులుంటాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వీటి డీఆర్ డిపోల ప్రాధాన్యం క్రమేపీ తగ్గనుందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆదరణ తగ్గిందని, ఇక సచివాలయాల ఆధ్వర్యంలో ప్రస్తుతం డిపోల ద్వారా సరఫరా అయ్యే సరకులన్నింటినీ వినియోగదారులకు నేరుగా ఇళ్ళకే చేరవేసే విధానం అందుబాటులోకి వస్తే డీఆర్ డిపోల నిర్వహణకు మంగళం పాడినట్టేనని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.