ఆంధ్రప్రదేశ్‌

పవన్‌తో భేదాభిప్రాయాలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 11: రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు అని జనసేన పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనసేన పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పటికీ వారి సేవలను సద్వినియోగం చేసుకోవటంలో అధిష్ఠానం ఘోరంగా విఫలమైన విషయం వాస్తవమేనని చెప్పారు. తాము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, తెలుగుభాషను కూడా సమానంగా చూడాలనే విషయాన్ని తమ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పినట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో విధిగా ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌తో పార్టీ పరంగా కొన్ని అంశాల్లో తనకు దూరం ఉన్నట్లు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనకు తెలిసిన అనేక అంశాలను పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వరప్రసాద్ వివరించారు.