ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సులన్నీ ఫిట్‌గానే ఉన్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: ఏపీఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం రోడ్డుపై తిరుగుతున్న బస్సులన్నీ రవాణా శాఖ అధికారులు జారీ చేసిన ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్‌తోనే తిరుగుతున్నాయని, 15 ఏళ్లు దాటిన బస్సులే లేవని శాసనసభ ప్రశ్నోత్తరాలలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర రవాణా శాఖ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు. దేశంలోనే ఏపీఎస్ ఆర్టీసీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఎప్పుడో... ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగినంత మాత్రాన బస్సులన్నీ ప్రమాదాలకు గురవుతున్నాయన్న ఆలోచన ఊహలు వద్దన్నారు. చిత్తూరు జిల్లాలో 1278 బస్సులుంటే అవన్నీ ఫిట్‌నెస్‌గా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 400 బస్సులు కొన్నామని ఆ తర్వాత మరో వెయ్యి బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. అలాగే 350 ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు పిలుస్తున్నామన్నారు.