ఆంధ్రప్రదేశ్‌

ఇక మార్కెట్ యార్డుల్లోనూ సబ్సిడీ ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలోని రైతుబజార్లతో పాటు ఇకపై మార్కెట్ యార్డుల్లో కూడా సబ్సిడీపై ఉల్లిని అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా సమస్య తీరేవరకు వెనుకంజ వేసే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు. మంగళవారం శాసనసభలో ఉల్లి కొరతపై ప్రతిపక్ష నేత చంద్ర బాబునాయుడు, టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. దేశం మొత్తంగా ఉల్లి కొరత ఉందని, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుని మన రాష్ట్రంలో కేవలం రూ. 25కే విక్రయాలు జరుపుతున్నామని పునరుద్ఘాటించారు. ఉల్లి అధికంగా పండించే రాష్ట్రాల్లో సైతం కిలో రూ. 100కు పైగా అమ్ముతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ధరలను సభ ముందుంచారు. బీహార్‌లో కిలో రూ. 35 కాగా, పశ్చిమ బెంగాల్‌లో రూ. 39, మధ్యప్రదేశ్‌లో రూ. 50, పొరుగున ఉన్న తెలంగాణలో సైతం కిలో ఉల్లి రూ. 50కు విక్రయిస్తున్నారన్నారు. రైతులు, ప్రజ ల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే రూ. 25కే ఉల్లిని సరసమైన ధరల్లో ప్రజలకు అందిస్తోందని చెప్పా రు. దీనిపై ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు వివరణ ఇస్తు న్నా ప్రతిపక్షం దీన్ని రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గుడివాడలో రైతు బజార్ వద్ద ఉల్లిపాయల కోసం క్యూలైన్‌లో నిలుచుని ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ఉల్లి కోసం క్యూలో నిలబడి సాంబిరెడ్డి మరణించలేదని స్వయాన ఆయన కుటుంబ సభ్యులే చెబుతుంటే చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణమైన రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు. ఇప్పటివరకు
రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని 38, 496 క్వింటాళ్లు ఉల్లిని దిగుమతి చేసుకున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో చౌకధరలకు సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నేతలు అవాస్తవ ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ. 200కు విక్రయిస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఏ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మొదటగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఉల్లి కొరత ఏర్పడిందని ఆ తరువాత పలు దఫాలుగా సమస్య జఠిలమైందని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరం వచ్చినప్పుడల్లా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని చెప్పారు. ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా రైతు బజార్లలో అందుబాటులోకి తెచ్చినందునే ప్రజలు విరివిగా కొనుగోళ్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరో రెండు రోజుల్లో ముంబై పోర్టుకు ఇతర దేశాల నుంచి వచ్చే ఉల్లిలో 2100 మెట్రిక్ టన్నుల్లో రాష్ట్రానిదే సింహ భాగమన్నారు. ఇంకా అవసరాలకు తగ్గట్టుగా అదనపు నిల్వలు చేసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దిగుమతి చేసుకుని ప్రభుత్వంపై భారం పడినా సబ్సిడీపై రూ. 25కే ఉల్లిని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఉల్లి విక్రయాలు ప్రారంభించాల్సిందిగా ఆదేశించామన్నారు. ప్రభుత్వపరంగా నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షం రాజకీయం చేయటం తగదన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోందనేది చంద్రబాబు మనస్సాక్షిని అడగాలన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి