ఆంధ్రప్రదేశ్‌

రేపే గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల కల్పనలో ప్రతి రైతుకు అండగా ఉంటామని వెల్లడించారు. మంగళవారం శాసనసభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరి, జొన్న, మొక్కజొన్న, రాగి,
కందులు, మినుములు, పెసలు, సెనగ, వేరుసెనగ, పసుపు, మిరప తదితర 11 పంటలకు గిట్టుబాటు ధరలను గురువారం ప్రకటిస్తామని తెలిపారు. ఈ రేటు కంటే తక్కువ ధరకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పనిలేదన్నారు. కనీస గిట్టుబాటు ధర లభించకపోతే కొనుగోలు కేంద్రాల వద్దకు నేరుగా వెళ్లి పంటను అమ్ముకునే వీలు కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తామని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే సమాచారం అందించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువు చేసుకునేందుకు నాలుగు అడుగులు ముందుకేస్తామని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మాదిరిగా మోసం చేసే ప్రభుత్వం కాదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి కింద ఇప్పటికే రూ. 3వేల కోట్లు కేటాయించామని, ఈ నిధితో కచ్చితంగా రైతులకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వారి ప్రభుత్వ హయాంలో రూ. 960 కోట్లు బకాయి పెడితే వాటిని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తుచేశారు. రైతుల బకాయిలు చెల్లించనందుకు ప్రతిపక్షనేత సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. కుక్కతోక వంకర సామెతకు చంద్రబాబే నిదర్శనమని ఆయన వైఖరిలో ఎన్నటికీ మార్పు రాదని విమర్శించారు.
*చిత్రం... సీఎం జగన్