ఆంధ్రప్రదేశ్‌

మాడుగుల శిల్పాల్ని కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: ఆంధ్రుల చరిత్ర, సంస్కృతికి ఆనవాళ్లైన చారిత్రక శిల్పాలను కాపాడి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత అందరిపైనా ఉందని పురావస్తు పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక, వారసత్వ సంపదను కాపాడడంలో స్థానికులను అవగాహన కల్పించి, వారిని భాగస్వామ్యం చేసేందుకు, కల్చరల్ సెంటర్ చేపట్టిన ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీలో భాగంగా ఆయన మంగళవారం గుంటూరు జిల్లా గురజాల సమీపంలోని మాడుగుల గ్రామంలోని శివాలయ సముదాయంలో నిర్లక్ష్యంగా ఒక గుట్టగా పోసిన ఉన్న 1500 సంవత్సరాల నాటి శిల్పాలను పరిశీలించారు. అప్పటి మత విశ్వాసాలకు ప్రతీకలుగా ఉన్న మహిషాసుర మర్దిని, వల్లి - సుబ్రహ్మణ్య, గణపతి, సూర్య, ఇంకా శాతవాహనుల కాలం నాటి బౌద్ధ శిల్ప స్తంభాలు, వేంగి చాళుక్యుల శాసనాలను శుభ్రం చేసి, పీఠాలపై నిలబెట్టి, వారి సంక్షిప్త చరిత్రన తెలిపే ఫలకాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ సెంటర్, హెరిటేజ్ క్లబ్ సమన్వయకర్త శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.