ఆంధ్రప్రదేశ్‌

నేను బీజేపీకి ఎప్పుడూ దూరం కాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: నేను బీజేపీకి ఎప్పుడు దూరమయ్యాను... ఎప్పుడూ దూరం కాలేదు... ప్రత్యేక హోదాకు సంబంధించి మాత్రమే బీజేపీకి దూరమయ్యాను. అది నా అవసరం కోసం కాదు.. ప్రజల కోసం అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన బుధవారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. గత నాలుగురోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించానన్నారు. ఈ సందర్భంగా బీజేపీతో ఎప్పుడు జత కడతారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు పవన్ స్పందిస్తూ తాను బీజేపీకి ఎప్పుడు దూరమయ్యానో మీరు చెప్పండంటూ విలేఖరులను ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మాత్రమే తాను బీజేపీని విభేదించానని, ఆ సమయంలోనే బయటకు వచ్చానన్నారు. అది తన స్వార్థం కోసం కాదని, ప్రజల కోసమేనని చెప్పారు. బీజేపీకి తానెప్పుడు దూరంగా లేనన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని వైకాపా నేతలు అంటున్నారని విలేఖరుల ప్రశ్నకు తనకు అమిత్‌షా అంటే గౌరవమని... వారికి భయం.. అంటూ అదే దానికి సమాధానమన్నారు. సైద్ధాంతికంగా జనసేన, బీజేపీల మధ్య వ్యత్యాసం ఉంది కదా... పొత్తు కుదురుతుందా అన్న ప్రశ్నకు నిజంగా ఆ విషయం తెలియదన్నారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ, సీపీఐ, బీఎస్పీ ఒక తాటిపైకి వచ్చాయి కదా అన్నారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో ఆవిర్భవించిన పార్టీ బీఎస్పీ అన్నారు. చివరకు బ్రాహ్మణుల సహాయం తీసుకోవాల్సి వచ్చింది కదా అన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో దేశ రాజధాని కావాలని నాడు మీరు నినదించారు కదా అన్న ప్రశ్నకు తెలంగాణాను వద్దన్నవారు కూడా తరువాత పరిణామాల్లో తెలంగాణ సాధన కోసం పాటుపడ్డారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో దేశ రాజధాని ఉండాలన్నది తన మాట కాదని, రాజ్యాంగరూప కర్త అంబేద్కర్ మాట అని చెప్పారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చెబుతున్న మీరు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికమంది ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించనని అన్నారు కదా... పవన్ కల్యాణ్ గుర్తించకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా అని విలేఖరులు ప్రశ్నించారు. మెజార్టీ ప్రజలు అయన్ను ముఖ్యమంత్రిగా గుర్తించారు కదా.. సంతోషం అన్నారు.