ఆంధ్రప్రదేశ్‌

పవన్‌ను వెంటాడుతున్న మానసిక సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 4: పవన్‌కళ్యాణ్‌కు మానసిక సమస్యలు వెంటాడుతున్నట్లుగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష ఎలా వేస్తారని పవన్‌కళ్యాణ్ ప్రశ్నించడం ఇందుకు నిదర్శనమని బుధవారం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే ఆయన మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే ఉందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని దేశమంతా కన్నీళ్లతో, ఆగ్రహంతో డిమాండ్ చేస్తుంటే పవన్‌కు మాత్రం రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమైపోయాయా? అంటూ ప్రశ్నించారు. పవనిజం అంటే ఇదేనేమా? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అంటూ ఎద్దేవా చేశారు. దే మంతా కలిసికట్టుగా దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంటే మరోవైపు పవన్ మాత్రం విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.