ఆంధ్రప్రదేశ్‌

5వ షెడ్యూల్డ్‌పై ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట,డిసెంబర్ 4: ఐదవ షెడ్యూల్ ఏరియాలో చేర్చడానికి నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాల ఎంపిక ప్రక్రియపై కొలిక్కి వచ్చే అవకాశాలు కానరావడం లేదు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతున్నా, గిరిజనులు పోరాటాలు సాగిస్తున్నా నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ ఐదవ షెడ్యూల్ ఏరియాలో చేర్చే ప్రయత్నాలపై ప్రతిష్టంభన నెలకొంది. అయిదవ షెడ్యూల్డ్ సాధన కోసం గడచిన ఎన్నోయేళ్లుగా గిరిజనులు పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినా వీరి పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంది. గిరిజన గ్రామాలను అయిదవ షెడ్యూల్డ్‌లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నివేదికలు కోరింది. ఈ విషయమై శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సిఎం సాయికాంత్‌వర్మ చొరవ తీసుకొని ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులతో ఐటిడిఎ కేంద్రంగా ప్రత్యేక సమావేశం ఇటీవల నిర్వహించారు. గిరిజన సంఘాల నాయకులు, పెద్దల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రాంతాల వారీగా ఏయే గ్రామాలను అయిదవ షెడ్యూల్డ్‌లో చేర్చాలనే దానిపై సేకరించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 50శాతం గిరిజనులు నివసిస్తున్న రెవెన్యూ గ్రామాలను మాత్రమే షెడ్యూల్డ్ ప్రాంతంలో చేర్చేందుకు అవకాశం ఉండడంతో గిరిజనుల ఆశలు ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయిదవ షెడ్యూల్డ్‌లో చేర్చేందుకు శ్రీకాకుళం జిల్లాలోని 18మండలాల్లో 124 గ్రామ పంచాయతీల పరిధిలో 572గ్రామాల జాబితాను గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ఐటిడిఎ కార్యాలయానికి అందజేశారు. దీనిపై ఐటిడిఎ అధికారులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 50శాతం పైబడి నివసిస్తున్న గిరిజన జనాభాను ఆధారంగా చేసుకొని సర్వే చేపట్టారు. సర్వే కోసం మూడు రకాల ప్రతిపాదనలను ఐటీడీఏ అధికారులు తయారుచేశారు. 50శాతం గిరిజన జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఐటిడిఎ పరిధిలో 51 గ్రామ పంచాయతీల్లో 90రెవెన్యూ గ్రామాల్లో 399 ఆవాస ప్రాంతాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అలాగే 2011 ఏడాది జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఐటిడి ఎ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల్లో 50శాతం పైబడి నివసిస్తున్న గిరిజన జనాభా ప్రాతిపదికన 157 రెవెన్యూ గ్రామాలు,1047 గిరిజన గ్రామాలు, 523 ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. అదే మూడవ ప్రతిపాదన ఆధారంగా చూసుకుంటే భౌగోళికంగా ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని చూస్తే ఐటిడిఎ పరిధిలో 14 మండలాల్లో 131 రెవెన్యూ గ్రామాల్లో, 444 ఆవాస ప్రాంతాలు వచ్చాయి. ఈ మూడు ప్రతిపాదనల ఆధారంగా సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేశారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియా గ్రామాల చేర్చడానికి సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్వీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా శాసనసభ్యులు హాజరై షెడ్యూల్డ్, నాన్‌షెడ్యూల్డ్ అంశంపై సమావేశంలోప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు పలు సూచనలు చేశారు. అన్ని గిరిజన గ్రామాలను అయిదవ షెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజనులు కోరుతున్న నేపథ్యంలో దీనిపై పునః పరిశీలన చేయాలని మంత్రులు ఐటిడిఏ అధికారులకు సూచించారు.