ఆంధ్రప్రదేశ్‌

జీడి పరిశ్రమలో పేలిన బాయిలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, డిసెంబర్ 4: శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామికవాడలోని దివాన్ క్యాషూ ఇండస్ట్రీస్‌లో బుధవారం బాయిలర్ పేలిన సంఘటనలో సుమారు 10 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనాలు వేస్తున్నారు. జీడి కార్మాగారంలో బాయిలర్ యూనిట్‌లో పనిచేసే కార్మికుడు జీడి గింజలను బాయిలింగ్ చేసేందుకు బాయిలింగ్ యూనిట్‌లో వేసి బయటకు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రమ్ము ఆకారంలో ఉన్న బాయిలర్‌లో జీడిగింజలను వేసి కట్టెల పొయ్యి ద్వారా మంటలు పెట్టి జీడి కార్మికుడు బహిర్భూమికి వెళ్లిన 10 నిముషాలకు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి జీడి పరిశ్రమ భవనం ధ్వంసం కాగా, ఘటనా స్థలంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాయిలర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈతరహా ప్రమాదం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. కాగా బాయిలర్ పేలుడు సంభవించడం జీడి వ్యాపారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.