ఆంధ్రప్రదేశ్‌

మాల, మాదిగ, రెల్లి ఫైనాన్స్ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: మాల, మాదిగ, రెల్లి వెల్పేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్‌లు, అధికారులతో మేనేజ్‌మెంట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. మాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పెదపాటి అమ్మాజీని నియమించగా, వివిధ శాఖలకు చెందిన 15 మంది అధికారులను సభ్యులుగా నియమించింది. మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా కొమ్మూరి కనకారావును, మరో 15 మంది అధికారులను సభ్యులుగా నియమించింది. రెల్లి, ఇతరుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వడ్డాది మధుసూధన రావును, సభ్యులుగా మరో 15 మంది అధికారులను నియమించింది. చైర్మన్‌ల పదవీ కాలం రెండు సంవత్సరాలుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాంకు రూ. 3.24 కోట్లు
రాష్ట్రంలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.24 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గడువు తగ్గింపు
మంత్రుల బృందానికి సలహాలు అందచేసేందుకు ఏర్పాటు చేసిన రెండు వర్కింగ్ కమిటీలు తమ నివేదికలు అందచేసే గడువును తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏర్పాటైన మంత్రుల బృందానికి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటైన వర్కింగ్ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది మార్చి 31లోగా అందచేయాలని తాజాగా ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. వచ్చే ఏడాది జూన్ 30లోగా నివేదిక ఇవ్వాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వుకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రిబ్యూటరీ పింఛను స్కీమ్ (సీపీఎస్)కు సంబంధించి ఏర్పాటైన మంత్రుల కమిటీకి సూచనలు అందచేసేందుకు నియమించిన వర్కింగ్ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది మార్చి 31లోగా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో జూన్ 30లోగా నివేదిక ఇవ్వాలని జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.