ఆంధ్రప్రదేశ్‌

గ్రానైట్ జోలికి వస్తే తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, డిసెంబర్ 4: విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని దాబుగుడ గ్రామ కొండల్లో నిక్షిప్తంగా ఉన్న గ్రానైట్ ఖనిజాల తవ్వకాల కోసం తరిమికొట్టాలని సి.పి.ఎం. రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్లో సురేంద్ర పిలుపునిచ్చారు. గ్రానైట్ ఖనిజాల తవ్వకాలకు వ్యతిరేకంగా దాబుగుడ గ్రానైట్ కొండల్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గిరిజనులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ఖనిజాల తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు నినాదాలు చేశారు. గ్రానైట్ ఖనిజ సంపద తవ్వకాల పేరుతో గ్రామాల్లో అడుగుపెట్టే కంపెనీ పెట్టుబడిదారుల ప్రతినిధులకు దేహశుద్ధి చేయాలన్నారు. అటవీ బ్లాక్ నెం 2లో, గిరిజనుడు కె.్ధర్మ పట్టా నెంబరు 22లో సుమారు వంద ఎకరాల భూముల్లో గ్రానైట్ ఖనిజాలు నిక్షిప్తమైనట్టు గణాంకాలు చెబుతున్నాయని సురేంద్ర చెప్పారు. గత నెలరోజులుగా సర్వేలు చేస్తున్నారని, దీనిని గిరిజనులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా సర్వేను నిలిపివేసిన వ్యాపారులు మళ్లీ రహస్యంగా రెవిన్యూ సిబ్బంది సహకారంతో సర్వే చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన చెప్పారు. గ్రానైట్ తవ్వకాలు చేపడితే మాదల పంచాయతీ పరిధిలోని పోతంగిపాడు, రక్తగుడ, తోటవలస, దాబుగుడ గ్రామాల్లో సాగులో ఉన్న వందలాది ఎకరాల పంట భూములు నాశనం అవుతాయని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గిరిజనులు సాగు చేసుకుంటున్న కాఫీ పంట కూడా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులంతా సంఘటితమై గ్రానైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు సమాయత్తం కావాలని సురేంద్ర కోరారు.