ఆంధ్రప్రదేశ్‌

పోలీస్‌కు భరోసా బీమా పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 4: పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ.. ఆపై స్థాయి వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీస్ సంక్షేమ నిధి నుంచి చెల్లిస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచింది. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ వరకు రూ. 13 లక్షలుగా ఉన్న బీమాను రూ. 20లక్షలకు, ఏఎస్‌ఐ నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు రూ. 35 లక్షలు, డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలు బీమా కింద చెల్లించనున్నారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభు త్వం, పోలీస్ శాఖల తరుపున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్ల చెక్కును హోం మంత్రి మేకతోటి సుచరిత అందజేశారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తో పాటు ప్రమాదవశాత్తు పోలీసులకు ఏదైనా జరిగితే చెల్లించే బీమా పాలసీని కూడా గణనీయంగా పెంచారు. పోలీస్ సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షలు అందించాలని కొద్దిరోజుల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా అమల్లోకి తెచ్చారు. ఇందులో 64719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఈ పాలీసీలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వారాంతపు సెలవుతో 64వేల మంది పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపారని, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా పాలసీ పెంచి మరింత భరోసా కల్పించారని పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎంను కలిసిన పదోన్నతి పొందిన ఏఎస్పీలు
డీఎస్పీ నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న తమ పదోన్నతుల విషయంలో అంగీకారం తెలిపి అమల్లోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ప్రకారం పారదర్శకంగా పదోన్నతుల ప్రక్రియ సాగిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరించారని, ఈ సారి నిష్పక్షపాతంగా సమాన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించారని ముఖ్యమంత్రికి వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో శక్తివంచన లేకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... పోలీసు బీమా ప్రీమియం చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్, తదితరులు