ఆంధ్రప్రదేశ్‌

న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలి: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 3: సమాజంలో ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడినా నిలదీయడం ప్రజల హక్కు అని, ముఖ్యంగా న్యాయవాదులు ఇలాంటి అంశాలపై ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందించాలని, అలా జరగాలంటే న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ 3వ రోజు జాతీయ న్యాయవాదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో చిత్తూరు జిల్లాలోని న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తనకు అనేక సమస్యల గురించి తెలిపారని, వారికి అండగా ఉంటానన్నారు. జగన్మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేల్లా తనకు ఆస్తులపై మమకారం లేదన్నారు. ప్రాణంమీద తీపి కూడా లేదన్నారు. దేశం మీద ప్రేమ, సమాజం పట్ల గౌరవంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మానవత్వమే నా మతమని చెప్పుకున్న ఆయన కడప జిల్లాలోని జనసైనికుల బత్తాయి చెట్లు ఎందుకు నరికించారో సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన మాట తప్పకపోవడమే నా కులం అని జగన్మోహన్‌రెడ్డి అంటున్నారని, అంటే తక్కిన కులాలు మాట తప్పుతాయా.. అని అంటారా అని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి వెనుక 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, జనసేనకు ఒక ఎమ్మెల్యే మాత్రం ఉన్నారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాష దారుణమన్నారు. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. మంత్రుల స్థాయిలోని వ్యక్తులే దిగజారి మాట్లాడితే రోడ్డుమీద తిరిగేవారు ఎందుకు అఘాయిత్యాలకు పాల్పడరన్నారు. నేడు అత్యాచారాలు జరుగుతున్నాయంటే ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్న వారు అనుసరిస్తున్న మార్గాలేననే అనుమానం వస్తోందన్నారు. తన నుంచి అద్భుతాలు ఆశించవద్దని, కిందపడ్డా, మీదపడ్డా మళ్లీ నిలబడతానని నమ్మితే చాలన్నారు. ఈ ఆరు నెలల్లో వైసీపీ పాలన చూస్తే ప్రజలకు కనీసం ఉల్లిపాయలు కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు. తన వెనకు వేల కోట్లు పెట్టుబడి పెట్టే సంపన్నులు లేరని, తనది 7 దశాబ్దాల పార్టీ కాదని, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక పార్టీ పెట్టానన్నారు. సామాన్యుడి కంటితడే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. గెలుపు ఓటములు తనకు పెద్దగా తేడా తెలియదన్నారు. త్వరలోనే లాయర్ల సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి పార్టీ లీగల్ వింగ్ బలోపేతానికి చర్చిస్తానన్నారు.
*చిత్రం...న్యాయవాదుల సదస్సులో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్