ఆంధ్రప్రదేశ్‌

ధైర్యముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులపై దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు నగర శివారులోని విజేఆర్ కనె్వన్షన్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం వైకాపా బాధిత కుటుంబాలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువై పోయాయన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, బెదరింపులు ఎక్కువయ్యాయన్నారు. వైకాపా నాయకుల చేతిలో గాయపడ్డ వారి కోసం గుంటూరులో ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ లబ్దికోసం అరాచకాలు సృష్టించి ఉంటే రాయలసీమ రావణకాష్టంగా మారేదన్నారు. షాద్‌నగర్ సంఘటన జరిగిన తర్వాత మహిళలు అభద్రతాభావంతో బతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడకపోతే ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు.నాగరిక ప్రపంచంలో జగన్ అనాగరికంగా ప్రవర్తిస్తుంటే ఆయన మంత్రులు బూతులు మాట్లాడుతున్నారన్నారు. వీరి పోర్టు పోలియోలు తీసివేసి బూతుల మంత్రులుగా పిలవాలన్నారు. అలాగే టీడీపీ నాయకులపై దాడి చేయటమే కాకుండా ఆస్థులు, ఇళ్లను ధ్వంసం చేసి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దాడులకు పాల్పడటం ఏమిటన్నారు. పిరికిపంద చర్యలను మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నాయకుల తాత్కాలిక ఉద్యోగాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చట్టాలను గౌరవించి ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు. అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి రాష్ట్భ్రావృద్ది, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోకుండా కేవలం టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకొని క్షేత్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతూ మానసికంగా దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక టీడిపి కార్యకర్త వంద మంది వైకాపా కార్యకర్తలతో సమానమని, వారు తిరగబడితే తట్టుకోలేరన్నారు. రెచ్చగొట్టాలని చూస్తే మరింత బలపడతామని, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడటానికి నిరంతరం పోరాటం చేస్తునే ఉంటామన్నారు. పేదల కన్నీళ్లు శాపంగా మారతాయని, ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. నా మతం మానవత్వమని వైయస్ జగన్ ప్రకటిస్తున్నారని, మానవత్వాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించాలన్నారు. మానవత్వంతో స్పందించాలని, లా అండ్ ఆర్డర్‌తో ఆడుకోవద్దని అదే పతనానికి నాంది అవుతుందన్నారు. వైయస్ జగన్‌కు ధైర్యం ఉంటే వైయస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన ఇంటి దొంగలను పట్టుకుని శిక్షించాలన్నారు. నేరచరిత్ర కలిగి ఉండి నేరాలు చేసుకుంటూ పోతామంటే ఎవ్వరూ భయపడరని, ఎన్ని దాడులు చేసినా బలపడతామే తప్ప బెదిరేది లేదన్నారు. ఇప్పటికైన తమ పంథా మార్చుకుని దాడులకు స్వస్తిపలకాలని, రాష్ట్భ్రావృద్ది గురించి ఆలోచించాలని లేని పక్షంలో తిరగబడితే తట్టుకోలేవని హెచ్చరించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరావుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.