ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది: దేవినేని ఉమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ. 67 వేల కోట్లు నష్టం జరిగిందని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ. 30వేల కోట్ల ఆదాయం పడిపోయిందని, రూ. 25వేల కోట్లు అప్పులు తెచ్చానని చెప్పుకోవటమే మంచి ముఖ్యమంత్రి కాదు ముంచే ముఖ్యమంత్రి అనటానికి నిదర్శనమని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో దేవినేని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, లక్ష బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, మద్యం షాపుల పక్కనే బెల్ట్‌షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారని అన్నారు.
మంత్రి కొడాలిని అరెస్ట్ చేయాలి
గుంటూరు: ఒక రాజధాని మహిళగా, రాజధాని అభివృద్ధికి కృషిచేసిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వల్లనే తాను స్పందించాల్సి వచ్చిందని టీడీపీ మహిళా కార్యకర్త యలమంచలి పద్మజ స్పష్టంచేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేసిన విధంగానే మంత్రి కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెను మంగళవారం కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్‌పై వదిలిపెట్టిన తరువాత పద్మజ మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కంచికచర్ల పోలీసులు తన నివాసానికి చేరుకుని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తనను అదుపులోకి తీసుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.