ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర బడ్జెట్‌కు భారం కానున్న పోలవరం ప్రాజెక్టు: తులసిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో గత టీడీపీ, ప్రస్తుత వైకాపా ప్రభుత్వాల నిర్వాకాల వల్ల పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి భారంగా తయారవడం శోచనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును మొత్తం కేంద్ర నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉందన్నారు. రాష్ట్రంపై ఆర్థిక భారం మోపకూడదన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రం చేయాల్సిన పని గత టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత వైకాపా ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 55,548 కోట్లలో దాదాపు రూ. 33వేల కోట్లు పునరావాసం, పునర్నిర్మాణానికి అవుతుందని, ఈ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం చెబుతోందన్నారు.