ఆంధ్రప్రదేశ్‌

బహుముఖ కార్యక్రమాలతో దశలవారీ మద్య నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో బహుముఖ కార్యక్రమాలతో దశలవారీ మద్య నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా మద్యం అమ్మకాలు లిక్కర్‌లో 26 శాతం, బీర్‌లో 50 శాతం తగ్గటమే దీనికి నిదర్శనమన్నారు. విజయవాడలోని ప్రొషిబిషన్, ఎక్సైజ్ కమిషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మద్య విమోచన ప్రచార కమిటీ ప్రథమ సమావేశానికి వీ లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. మద్య విమోచన ప్రచార కమిటీకి రాష్ట్ర కార్యాలయం గుంటూరులో ఏర్పాటు చేసుకుని, మద్యం దుష్ఫలితాలపై విస్తృతంగా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్, గుజరాత్, మీజోరం రాష్ట్రాలు పర్యటించి వాటి అనుభవాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని నిర్ణయించామన్నారు.
రేపటితో ముగియనున్న హజ్‌యాత్ర దరఖాస్తు గడువు
విజయవాడ, డిసెంబర్ 3: 2020 హజ్‌యాత్రకు దరఖాస్తు గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనున్నదని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు 2507 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే రూ. 60 వేలు, ఎక్కువగా ఉంటే రూ. 30వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు.