ఆంధ్రప్రదేశ్‌

మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలతో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని రాష్ట్ర హోం, విపత్తుల నివారణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో తీవ్రస్థాయిలో చర్చలు జరగడం, తరువాత విషయాన్ని మరచిపోవడం, శిక్షల ఖరారులో జాప్యం జరగడంతో నిందితుల్లో భయం తగ్గి ధీమాగా వ్యవహరిస్తుండటం ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను హోం మంత్రి ఆదేశించారు. మంగళవారం గుంటూరులోని మహిళా పోలీసుస్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలతో మాట్లాడి వారికి ఏ విధమైన సహాయం అందుతుందో అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీసుస్టేషన్ డీఎస్‌పీ సీతారామయ్య నుండి ఈ ఏడాడి మే నుండి డిసెంబర్ వరకు నమోదైన కేసుల వివరాలు, పరిష్కరించిన కేసులు, మహిళలపై ఏ విధంగా అండగా నిలుస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ ఇతర దేశాల్లో మహిళలపై దాడులు జరిగితే వెంటనే సంబంధిత నిందితులను నడిరొడ్డుపై కాల్చి చంపడం, ఉరి తీయడం వంటి తక్షణ, కఠినమైన శిక్షలు అమలు చేస్తుండటంతో నేరాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉంటున్నాయని అన్నారు. ఇక్కడ మాత్రం నేరం చేసినా శిక్షలు పడవన్న ధీమాతో నిందితులు వ్యవహరిస్తున్నారని అంటూ ఇందుకు చిత్తూరు జిల్లాలో వర్షితపై జరిగిన అఘాయిత్యాన్ని ఆమె ఉదహరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. అత్యవసర సమయాల్లో మహిళల కోసం 1104, 100, 1100తో పాటు వారు ప్రయాణించే ఆటోలు, ఇతరత్రా క్యాబ్‌లకు జీపీఎస్ ఏర్పాటు చేసి, వాటిని నేరుగా జిల్లా, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆడపిల్లలపై దాడులు, అత్యాచార్యాలు, హత్యలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కేసుల విచారణకు కూడా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూస్తామన్నారు. హోం మంత్రి వెంట అర్బన్ ఇన్‌ఛార్జి ఎస్‌పి సిహెచ్ విజయారావు, అదనపు ఎస్‌పి చంద్రశేఖరరావు, డిఎస్‌పి సత్యనారాయణ, సిఐ వెంకటరెడ్డి, ఎస్‌ఐ ఆరోగ్యరాజు తదితరులున్నారు.
మహిళల రక్షణకు కొత్త చట్టాలు
విజయవాడ (క్రైం): మహిళల రక్షణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కొత్త చట్టాలు తెచ్చే యోచనలో ఉన్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి, తానేటి వనిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్ద, డీజీపీ గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత 181, 100కు డయల్ చేస్తే సహాయం లభిస్తుందన్న అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని పేర్కొన్నారు.
*చిత్రం... పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదిదారులతో మాట్లాడుతున్న హోం మంత్రి సుచరిత