ఆంధ్రప్రదేశ్‌

భయమేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోడూరు: తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడి, కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన ఉన్మాదికి బెయిలు రాకుండా చూడాలని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన కొవ్వూరి తేజస్విని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఆ ఉన్మాది బయటకు వస్తాడంటే నిద్రకూడా పట్టడంలేదని, కచ్చితంగా తనను ప్రాణాలతో బతకనీయడని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. ఎంఎస్సీ ఫస్టియర్ విద్యార్థిని అయిన తేజస్విని కళాశాలకు వెళుతున్న సమయంలో అక్టోబర్ 16వ తేదీన అదే గ్రామానికి చెందిన మేడపాటి సుధాకర్‌రెడ్డి అనే ఉన్మాది కత్తితో దాడిచేసిన సంగతి విదితమే. వివాహమై, పిల్లలున్న సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా తేజస్వినిని వేధిస్తూ, చివరకు దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడి, కోలుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన ఆమె కవిటంలోని తమ అమ్మమ్మ నల్లిమిల్లి జయలక్ష్మి ఇంటివద్ద మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తన ఆవేదనను పంచుకుంది.రసాయనశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తిచేసి, ఉద్యోగం చేయాలనేది తన లక్ష్యమని, పెనుగొండ కళాశాలలో చదువుతున్న తనను గత ఐదు నెలలుగా సుధాకర్‌రెడ్డి వేధిస్తున్నాడని తేజస్విని తెలిపింది. చదువు మానిపించేస్తారనే భయంతో ఇంట్లో చెప్పలేదని, అయితే వేధింపులు ఎక్కువ కావడంతో చెప్పాల్సివచ్చిందని పేర్కొంది. పెద్దల సమక్షంలో తన జోలికి రానని రాసిచ్చిన సుధాకర్‌రెడ్డి ఊహించని విధంగా కళాశాలకు వెళుతున్న తనపై కత్తితో దాడిచేశాడని తెలిపింది. తల, వీపు, భుజాలపై మొత్తం 83 కుట్లు పడ్డాయని తెలిపింది. చావకుండానే నరకం అంటే ఏమిటో తానుచూశానని తేజస్విని వాపోయింది.
తన వెనక నరాలు తెగడంవల్ల శరీరం మొత్తం ఇప్పటికీ స్పర్శలేదని, వేరేవారి సహాయం లేకుండా ఏపని చేయలేకపోతున్నాని తెలిపింది. పుర్రెలో ఎముక మెదడులో గుచ్చుకోవడంవల్ల తీవ్రమైన తలనొప్పి వస్తోందని తెలిపింది. శారీరకంగా అతను చేసిన దాడి తన జీవితంపై పడిందని తేజస్విని పేర్కొంది. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, జీవితంలో స్థిరపడాలన్న తన లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమా వ్యక్తంచేసింది. అయితే తాను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని పేర్కొంది. కోలుకుని బయటకు రావడానికి ధైర్యంగా ఎదురుచూస్తుంటే తనపై దాడిచేసిన సుధాకర్‌రెడ్డికి త్వరలో బెయిలు వస్తుందని వినిపిస్తున్న వదంతులు మళ్లీ తనకు భయం కలిగిస్తున్నాయని పేర్కొంది. పెద్దల సమక్షంలో లేఖ రాసిచ్చి, తనపై దాడికి తెగబడిన వ్యక్తి, మళ్లీ తనపై దాడిచేయకుండా వదలడని తేజస్విని పేర్కొంది. ఆ ఉన్మాదికి బెయిలు వచ్చి తనకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, జగనన్న బాధ్యత వహించాలని తేజస్విని పేర్కొంది. దాడి జరిగిన నాటి నుంచి తనకు వెన్నంటివున్న మంత్రులు ఆళ్లనాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పోలీసు అధికారులు, మీడియాకు తేజస్విని కృతజ్ఞతలు తెలిపింది.
న్యాయవాదులు సహకరించాలి
తేజస్వినిపై కిరాతకంగా దాడిచేసిన ఉన్మాదికి బెయిలు రాకుండా న్యాయవాదులంతా సహకరించాలని పోడూరు మండలానికి చెందిన వైసీపీ నేత జి పెద్దిరాజు విజ్ఞప్తిచేశారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘోర ఉదంతం అందరికీ తెలిసిందేనని, ఇలాంటి ఘటనల నేపథ్యంలో తేజస్వినికి ప్రాణహాని కలిగించే అవకాశమున్నందున నిందితుడు సుధాకర్‌రెడ్డికి బెయిలు రాకుండా సహకరించాలన్నారు. దాడి జరిగిన నాటి నుండి తేజస్వినికి వెన్నంటివున్న తాను మున్ముందు కూడా ఆమెకు అన్నిరకాలుగా సహకరిస్తానని పెద్దిరాజు ప్రకటించారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న బాధితురాలు తేజస్విని