ఆంధ్రప్రదేశ్‌

ఇసుక తరహాలో మట్టి పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇసుక విధానం తరహాలో మట్టికి కూడా ఒక విధానం అమలు చేయాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో గనులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు మట్టి దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి కనీసం సీనరేజ్ కూడా చెల్లించకుండా మట్టిని విక్రయించారని విమర్శించారు. కోట్లాది రూపాయల పోలవరం మట్టిని అనధికారికంగా తరలించారన్నారు. మట్టి మాఫియాకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇసుక విధానం తరహాలో మట్టికి కూడా ఒక విధానం రూపొందించాల్సి ఉందన్నారు. పోలవరం మట్టి అక్రమ రవాణాకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం కాలువ గట్లపై సుమారు 12 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి ఉందన్నారు. దీనిని నిబంధనల మేరకు విక్రయిస్తే, దాదాపు 1000 కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుందన్నారు. దీనిలో ఇరిగేషన్ శాఖకు 700 కోట్లు, గనుల శాఖకు 300 కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లా పరిధిలో మట్టి నిల్వలు భారీగా ఉన్నాయన్నారు. పోలవరం మట్టిని నిల్వ చేసేందుకు సుమారు 5 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. మట్టి విక్రయాలు పూర్తి అయ్యాక ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకునే వీలు ఉందన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాలువలపై మట్టిని 80 ప్యాకేజీలుగా విభజించామన్నారు. ఇరిగేషన్, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ ప్యాకేజీలను పరిశీలించాలన్నారు. రెండు వారాల్లో దీనిపై ఒక పాలసీ రూపొందించాలని ఆదేశించారు. కాలువ గట్లపై ఉన్న మట్టి, గ్రావెల్‌ను వర్గీకరించాలన్నారు. మట్టి ధర క్యూబిక్ మీటరుకు 86 రూపాయలు, గ్రావెల్ ధర యూనిట్‌కు 113 రూపాయలుగా ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా మైనింగ్ సీనరేజ్ కింద క్యూబిక్ మీటరుకు 30 రూపాయలు వసూలు చేయాలన్నారు. మట్టి నిల్వలను టెండరు, వేలం పద్ధతిలో విక్రయించాలన్నారు. మూడేళ్లలో మట్టి నిల్వలను విక్రయించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే 71 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కోసం 41 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గ్రావెల్, మెటల్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. మెటల్ ఎక్కువగా ఉన్న చోట్ల అవసరమైతే క్రషర్లను కూడా అనుమతిస్తామని తెలిపారు.

*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్‌కుమార్