ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ ప్రమాణాలతో విశాఖ మెట్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: ప్రపంచ ప్రమాణాలను ఆధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విశాఖ నగరంలో రవాణా, తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్ట్‌లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం నుంచి నేరుగా పైపులైన్ల ద్వారా విశాఖ నగరానికి నిరంతర నీటి సరఫరాపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. విశాఖ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. మొత్తం 10 విడతలు.. 10 కారిడార్లుగా 140.13 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగింది. మొదటి దశలో 46.40 కిలో మీటర్లు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది 34.23 కిలోమీటర్లు, గురుద్వారా- ఓల్డ్ పోస్ట్ఫాస్ 5.26 కిలోమీటర్లు, తాడిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలోమీటర్లు 2020-24 మధ్య పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘మనం ఏం చేసినా చరిత్ర గుర్తుంచు కోవాలి... ఇవాళ దేవుడు అవకాశం ఇచ్చాడు.. భావి తరాలు మెచ్చుకునే రీతిలో పనులు జరగాలన్నారు. మంచి నిర్మాణ శైలిని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. మెట్రోరైల్ కోచ్‌ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అత్యుత్తమ విధానాలను పాటించాలన్నారు. ముంబై మెట్రో పిల్లర్ డిజైన్‌ను పరిశీలించాలని, ప్రతి స్టేషన్ వద్ద, ప్రధాన జంక్షన్లలో పార్కింగ్ స్థలాలు ఉండాలని ప్రతిపాదించారు.
బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియంపై అధికారులకు పలు సూచనలు చేశారు. డిజైన్లలో కొద్దిపాటి మార్పులు జరగాలన్నారు. సబ్‌మెరైన్ మ్యూజియం, ఫుడ్ కోర్టుల ఏర్పాట్లను అధికారులు వివరించారు. కైలాసగిరిలో ప్లానెటోరియం వివరాలను అందజేశారు. త్వరలో పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలో భూగర్భ డ్రెయినేజి వ్యవస్థను పటిష్టం చేయటంతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విశాఖ నగరాన్ని పీడిస్తున్న కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. కాపులుప్పాడు డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియ అమలు చేయాలని
నిర్ణయించారు. దీనివల్ల కాలుష్య నియంత్రణ సాధ్యపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
పరిశ్రమల అవసరాలకు డీ శాలినేషన్ వాటర్ ప్లాంట్లు
పరిశ్రమల అవసరాలకు ఇజ్రాయెల్ తరహాలో డీ శాలినేషన్ వాటర్ ప్లాంట్లను వినియోగించాలని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇజ్రాయెల్‌లో వేయి లీటర్లకు 57 సెంట్స్ అంటే లీటర్ నీటికి 4 పైసలు మాత్రమే ఖర్చవుతుందని డీశాలినేషన్ చేసిన నీటిని పరిశ్రమలకు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
పోలవరం నుంచి నీరు
పోలవరం వద్దే నీటిని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి విశాఖకు తరలించాలని సీఎం అధికారులకు సూచించారు. కాల్వల ద్వారా వస్తున్న నీటిలో చాలావరకు వృథా అవుతోందని అధికారులు తెలిపారు. సుమారు 40 శాతం వృథా అవుతున్నట్లు గుర్తించారు. పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరా అత్యవసరాన్ని సమావేశంలో చర్చించారు. వాటర్‌గ్రిడ్‌లో భాగంగా చేపట్టే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు తాగునీటి వసతి కల్పిస్తూ, పరిశ్రమల అవసరాలను తీర్చేలా ప్రతిపాదనలు రూపొందించాలని నిర్దేశించారు. విశాఖ భవిష్యత్ అవసరాలు తీర్చేలా తాగునీటి సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, మునిసిపల్ కమిషనర్ సృజన, వీఎంఆర్‌డీఏ వైస్‌చైర్మన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి