ఆంధ్రప్రదేశ్‌

పట్టణ ప్రాంతాల్లో.. ఒక సెంటు స్థలమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి అదనంగా కొన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు భూమిని కేటాయించేందుకు తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేయడం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్న మేరకు ఒక సెంటు భూమిని ఒక్కో లబ్ధిదారునికి కేటాయించనుంది. దీని వల్ల ఒక ఎకరా స్థలంలో 55 మందికి ఇంటి స్థలం కేటాయించేందుకు వీలు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల జీ + 3 విధానంలో ఫ్లాట్లను నిర్మించి ఇస్తారు. ఈ పథకం జీవితంలో ఒకసారి మాత్రమే అమలు చేస్తారు. అర్హులైనప్పటికీ, రేషన్ కార్డు లేని వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. అయితే మీ-సేవ కేంద్రాల ద్వారా ఆదాయ ధ్రువీకరణ పత్రం అందచేయడం తప్పనిసరి. ప్రభుత్వ భూములను ఆక్రమించి నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలను కేటాయించాక, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తారు. ప్రతి తహశీల్దారు అందుబాటులో ఉన్న భూమి, అదనంగా కావాల్సిన భూమి వివరాలను జిల్లా కలెక్టరుకు తెలియచేయాలి. నిబంధనల మేరకే లే అవుట్లు వేయాలి. భవిష్యత్తు అవసరాలు, డూప్లికేషన్ లేకుండా ఉండేందుకు ఇళ్ల స్థలాలను ఆధార్, రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఈ ఇళ్ల కేటాయింపు ఉచితం కాదు, రాయితీపై ఇస్తున్నట్లు పరిగణించాలి. స్టాంప్ పేపరు, ల్యామినేషన్ కింద 20 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాలి. 5 సంవత్సరాల పాటు ఆ ప్లాట్‌ను క్రయవిక్రయాలు చేసేందుకు వీలు లేదు. ఆ తరువాత విక్రయించేందుకు అనుమతించనుంది. విక్రయానికి నిరభ్యంతర పత్రం అవసరం లేదు. లబ్ధిదారుల వివరాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రచురించాలి.