ఆంధ్రప్రదేశ్‌

‘జీరో ఎఫ్‌ఐఆర్’ పై వారంలో విధి విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: బాధితుల ఫిర్యాదులకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో కూడా జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయాలన్నారు. ఈ విధానం అమలులో ఉంటే పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. నేరం జరిగిన ప్రాంతం తమ స్టేషన్ పరిధిలోది కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్ పేరిట బాధితులు ఏ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా దానిని తప్పకుండా స్వీకరించి, విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు సదరు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వలంటీర్లకు శిక్షణ ఇచ్చే వర్క్‌షాప్‌ను సోమవారం ప్రారంభించిన సందర్భంలో డీజీపీ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు నేరుగా పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ముందస్తు సమాచారం తెలుసుకునేందుకు మహిళా పోలీసు వలంటీర్ వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం, పోక్సో చట్టం అమలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు వీలుంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని ప్రజల చెంతకు చేర్చడంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కీలకం కానుందని పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా
14,967 పోలీసు వలంటీర్లు పనిచేయనున్నారని, 10 దశల్లో 11 కేంద్రాల్లో వలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మహిళా, శిశు రక్షణ, భద్రత దేశవ్యాప్తంగా సవాల్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వలంటీర్ల ద్వారా కచ్చితమైన మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దీనికి ప్రజల సహకారం, భాగస్వామ్యం అవసరమని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తిచేశారు.
*చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ