ఆంధ్రప్రదేశ్‌

నా మతం మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2: ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తామని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని, పరిపాలన సుభిక్షంగా ఉంటే జీర్ణించుకోలేని స్థితిలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని గుంటూరు నగరంలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ప్రారంభించి, రోగులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ సభకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్త్ఫా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేక కొందరు తనకు కులాన్ని, మతాన్ని కూడా ఆపాదించడం బాధాకరమన్నారు. తన మతం మానవత్వమయితే, తన కులం ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకోవడం అని సభికుల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టో రెండు పేజీలకే పరిమితం చేసి అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లో సమానమని, ఇది తెలియని కొందరు తమ ఇష్టారాజ్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు. సుపరిపాలన అందిస్తుంటే ఈర్ష్యాద్వేషాలతో పొంతన లేని ప్రకటనలు
చేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకుని వైద్యుల సిఫారసు మేరకు ఇంటికి వెళ్లి ఎటువంటి పనులు చేసుకోలేని వారికి విశ్రాంతి సమయంలో రోజుకి 225 రూపాయలు చొప్పున గరిష్ఠంగా నెలకు 5 వేల రూపాయల వరకు అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలతో కూడిన మంచి మందులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2020 జనవరి నాటికి హెల్త్ రికార్డులతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడంతో పాటు ఇప్పటికే 1200 వ్యాధులకు విస్తరించిన ఆర్యోగశ్రీ పరిధిని 2 వేల రోగాలకు వర్తింపజేసేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే డయాలసిస్ రోగులకు నెలకు 10 వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పారు.
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదు
మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడటం లేదని, అందుకే ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తూ సమయపాలన విధించామని స్పష్టంచేశారు. మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలను పెంచామన్నారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తుంటే కొందరు తమ ప్రభుత్వంపై అక్కస్సుతో నానా యాగీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డిసెంబర్ 15వ తేదీ నాటికి 510 రకాల మందులను అందుబాటులోకి తెస్తామన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య పెంచుతామని, ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 1500 కోట్ల నిధులు కేటాయించి అన్ని హంగులతో సుందరీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏడు చోట్ల బోధనాసుపత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు. 2020 ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్సులను కొనుగోలు చేసి 104, 108కి ఫోన్ చేస్తే 20 నిముషాల్లో ప్రమాద స్థలికి చేరుకునేలా చర్యలు చేపట్టామన్నారు. 66 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఆరు నెలల తర్వాత ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నుండి మొదటి సారి పైలెట్ ప్రాజెక్టుగా జనవరి నుండి ప్రారంభిస్తామని, తరువాత ప్రతి జిల్లాకు ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చర్యలు చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చెన్నై, హైదరాబాద్, బెంగళూర్‌లలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా అమలు చేస్తున్నామన్నారు. మీ అందరి అండదండలు ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని స్పష్టంచేశారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ పినె్నల్లి రామకృష్ణారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య విద్యార్థులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.

*చిత్రం...జీజీహెచ్‌లో రోగిని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి