ఆంధ్రప్రదేశ్‌

జోరుగా ఇసుక తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీరాల్లో గత కొద్ది రోజులుగా వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. గత నెలాఖరు వరకే 23లక్షల 81వేల 716 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నూతన ఇసుక విధానం అమల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 89.31 కోట్ల మేర ఆదాయం లభించింది. స్టాక్ పాయింట్లలో గందరగోళానికి తావులేకుండా, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇసుక అమ్మకాలను పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని రీచ్‌ల నుంచి రూ. 18.09 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి రూ. 5.74 కోట్లు, విజయనగరం సీనరేజ్ ద్వారా రూ. 55 లక్షలు, విశాఖ జిల్లా నుంచి రూ. 4.44 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా నుంచి రూ. 9.60కోట్లు, గుంటూరు జిల్లా నుంచి రూ. 16.61 కోట్ల ఆదాయం లభించింది. ప్రకాశం జిల్లా నుంచి రూ. 1.71 కోట్లు, నెల్లూరు జిల్లా నుంచి రూ 8.05కోట్లు, కడప జిల్లా నుంచి రూ. 6.47 కోట్లు, చిత్తూరు జిల్లా నుంచి రూ. 4.02 కోట్లు, కర్నూలు జిల్లా నుంచి రూ. 3.82 కోట్లు, అనంతపురం జిల్లా నుంచి రూ. 5.97 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు.