ఆంధ్రప్రదేశ్‌

ఎయిడ్స్ రహిత రాష్ట్రం మన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: సమాజ భాగస్వామ్యంతో ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ ఆదివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా కాళీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతక వ్యాధి అని, ఈ వ్యాధి సోకినవారికి చికిత్స లేదనే భయంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. ఇప్పుడు వ్యాధి సోకినవారు కూడా ఎక్కువ కాలం జీవించేలా ఎన్నో మందులు వచ్చాయన్నారు. అయితే వ్యాధి నివారణే లక్ష్యంగా సమాజం ముందుకు సాగాలని ఆయన పిలుపిచ్చారు. ఎయిడ్స్ బాధితులకు 104, 108 అంబులెన్స్‌లు, జిల్లా ఆసుపత్రుల నుండి పీహెచ్‌సీల వరకు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. మందులకు లోటు లేకుండా చూస్తూ పౌష్టికాహారం కూడా అందిస్తున్నామన్నారు. 60ఏళ్లు పైబడిన 34వేల మంది ఎయిడ్స్ బాధితులకు ప్రస్తుతం రూ. 2250 పింఛన్ ఇస్తున్నామని, ఇంకా మిగిలి ఉన్న 74వేల మందికి కూడా పింఛన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు ఆత్మస్థైర్యంతో ఎయిడ్స్‌ను ఎదుర్కోవాలని, వారు కోలుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని దక్షిణ భారతదేశంలో 1986లో, హైదరాబాద్‌లో 1987లో గుర్తించారని, అప్పటి నుంచి నిర్మూలన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అందిస్తున్నామన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ 16-24 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ నివారణ, అవగాహనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఐఈసీ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏపీ శాక్స్ పీడీ డా. అరుణకుమారి, ఏపీడీ వసంతకుమారి, జేడీ రాజేంద్రప్రసాద్, డీడీ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.