ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ తీరు తిరుమల ప్రతిష్టకు భంగకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 1: ప్రపంచంలోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను భంగపరిచేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. ఆగమ శాస్త్రం విలువలను మంటగలిపేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తిరుమల బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం మొదలు టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్ చేయడం, టీటీడీలో అన్యమతస్తులు విధులు నిర్వర్తించడం, అమరావతిలో శ్రీహరి ఆలయ నిర్మాణానికి నిధులు తగ్గించటం, పవిత్ర తిరుమల ఆలయంపై మంత్రుల పరుష పదజాలం వంటి సంఘటనలతో శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆదివారం ఇక్కడో ప్రకటనలో నిరసన తెలిపారు. తాజాగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోని పంచాంగ సమాచారంలో శ్రీ యేసయ్య అనే అక్షరాలు వెంకన్న భక్తులను తీవ్రంగా కలచివేశాయన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం, అన్యమత దైవాన్ని కానీ కలలో కూడా ఊహించుకోలేని భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోందన్నారు. పదేపదే తెలుగుదేశం పార్టీపై లేని ఆరోపణలు గుప్పించే మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు దీనికి ఏమి సమాధానమిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓ,మీ వ్యవహార శైలి మార్చుకుని తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆనందసూర్య డిమాండ్ చేశారు.