ఆంధ్రప్రదేశ్‌

నాడు-నేడు పర్యవేక్షణకు పీఎంయూ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన మార్పులను త్వరితగతిన తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నాడు-నేడు పథకం అమలుకు ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఏర్పాటు చేసింది. విద్య, ఆరోగ్య రంగాల్లో వౌలిక వసతుల ఆధునీకరణ, సేవల మెరుగుదల, తదితర అభివృద్ధి చర్యలను నిర్ణీత సమయంలో చేపట్టేందుకు ఈ పథకాన్ని చేపట్టింది. దీనికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేయడం ద్వారా స్పష్టమైన మార్పు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ కొనుగోళ్లు, కాంట్రాక్టులు, నిర్మాణాలు, తదితర అంశాల్లో పారదర్శకత పెంపొందించేందుకు, సమయపాలనకు వీలుగా ఈ పీఎంయూ ఏర్పాటయింది. రిటైర్డ్ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎఫ్‌సీఎస్ పీటర్ పీఎంయూకు సారథ్యం వహిస్తారు. ఆయనకు అవసరమైన మానవ వనరులను ఆ రెండు శాఖల నుంచి అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.