ఆంధ్రప్రదేశ్‌

ఇదో వింత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసే ప్రొఫెసర్లు ప్రాసెసింగ్ ఫీజుగా వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందేనని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అయితే ఇది వింత నిర్ణయమని ప్రొఫెసర్ల విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీలకు వీసీలుగా నియమించేందుకు సెర్చి కమిటీలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఆంధ్రా వర్సిటీ, ద్రవిడియన్ వర్సిటీ, కృష్ణా వర్సిటీ, ఆదికవి నన్నయ వర్సిటీ, నాగార్జున వర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వర్సిటీలకు వీసీలను నియమించేందుకు సెర్చి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈవిషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తన వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచింది. అర్హులైన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే దరఖాస్తు చేసే ఫ్రొఫెసరు ప్రాసెసింగ్ ఫీజు కింద 1000 రూపాయలు చెల్లించాలన్న నిబంధన విధించింది. తొలిసారిగా ఈ నిబంధన విధించడం గమనార్హం. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే దరఖాస్తులను పరిశీలించబోమని కూడా స్పష్టం చేసింది. అన్ని వర్సిటీలకు కలిపి ఒక దరఖాస్తు కాకుండా విడివిడిగా దరఖాస్తు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఫీజు కింద 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బర్త్ సర్ట్ఫికెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా నియామక ఉత్తర్వులు, సర్వీస్, తదితర సర్ట్ఫికెట్లపై ఆయా వర్సిటీల రిజిస్ట్రార్‌లు సంతకాలు చేయాలన్న షరతు కూడా విధించింది. ఉన్నత విద్యా మండలి తీరుపై కొందరు ప్రొఫెసర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫీజు వసూలు చేయడం తమ విలువను తగ్గించడమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ వర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసిన తాము పోటీ పరీక్షలకు వెళ్తున్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. ఈ తరహా ఫీజు వసూలు సరికాదని అంటున్నారు. అయితే ఉన్నత విద్యా మండలి వర్గాలు మాత్రం దీన్ని సమర్థిస్తున్నాయి. అంత సీరియస్‌గా ప్రయత్నించని వారి సంఖ్యను తగ్గించేందుకు ఈ ఫీజు నిర్ణయించినట్లు చెబుతున్నాయి. ప్రతి వీసీ పోస్టుకు దాదాపు 150 దరఖాస్తులు వస్తున్నాయంటూ వివరిస్తున్నారు.