ఆంధ్రప్రదేశ్‌

శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు ఆభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచమీతీర్థం మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బంగారు ఆభరణాన్ని శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు. ముఖ్యమంత్రి తరపున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రూ. 7 లక్షల విలువైన 113 గ్రాముల బరువున్న అన్‌కట్ డైమెండ్ నెక్లెస్‌ను అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు. తుడా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం గరుడ సేవకు బదులు ధ్వజారోహణం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడైన జగన్మోహన్‌రెడ్డి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీతీర్థం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి ఏడాది పట్టువస్త్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారని అన్నారు.

*చిత్రం...తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పంచమీతీర్థం కార్యక్రమానికి హాజరైన భక్తజన సందోహం