ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఆరు నెలల పాలనలో మిశ్రమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 6నెలల పాలన మిశ్రమ ఫలితాలనిచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. 6నెలల పాలన కొందరికి మోదం, మరికొందరికి ఖేదంగా గడిచిందన్నారు. నవరత్నాల అమలుకు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు కృషి జరిగిందని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారని, అయితే ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొందని ఆయన తెలిపారు. రాజధాని అమరావతిని శ్మశానంతో పోలుస్తూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనస్సులను గాయపరిచాయని రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదని, సమష్టి నిర్ణయాలతో ప్రజారంజక పాలన సాగించడంలో విఫలమయ్యారని విమర్శించారు. 6నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని రామకృష్ణ వివరించారు.