ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ రంగానికి కొత్త వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యుత్ రంగానికి కొత్త వెలుగులు సంతరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంధన రంగాన్ని పునాదుల నుంచి పటిష్టం చేయాలని భావిస్తోంది. గ్రామస్థాయి నుంచి వౌలిక వసతులు, సిబ్బంది నియామకం, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. చాలాకాలంగా అనేక పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యుత్ వ్యవస్థ ఇబ్బందులకు గురవుతోందన్న అభిప్రాయం నెలకొంది. సిబ్బంది కొరత వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తేవి. గ్రామ, మండల స్థాయిలో సేవలకు నైపుణ్యం లేని ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడుతున్నారనే అపవాదును మోయాల్సి వస్తోంది. తుపానులు, తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తగినంత మంది నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవడం కత్తిమీద సాములా మారింది. కీలకమైన అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులు కూడా ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోందన్న విమర్శలున్నాయి. దీనికితోడు అధికారుల కొరత, సబ్‌స్టేషన్లు, కొత్త లైన్ల పనులపై పర్యవేక్షణ లేక పురోగతి ఆశించిన మేర ఉండటం లేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం వివిధ నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. సమస్యలు అధిగమించటంపై ఇంధన శాఖ దృష్టి సారించింది. డిసెంబర్ 2న 170మంది అసిస్టెంట్ ఇంజనీర్ల (ఏఈల)కు నియామకాల పత్రాలు అందచేసేందుకు ఇంధన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 35మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను (ఏఈఈ), గ్రామ, మండల స్థాయిలో కీలకమైన ఎనర్జీ అసిస్టెంట్లనూ నియమించారు. 7966 మంది ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు మంజూరు కాగా, 7990 మంది నియామకాలు పూర్తయ్యాయి. వీరిలో ఐటీఐ అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశం లభించింది. ఇది అరుదైన విషయమని అంటున్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు, లైన్ల ఏర్పాటు పనులను సంస్థ వేగవంతం చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్ల సామర్థ్యం 10,965 ఎంవీఏలు. కర్నూలు జిల్లాలో మరో 1000 ఎంవీఏ సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్ల నిర్మాణం టెండర్ల దశలో ఉంది. ఇప్పటికే ఏర్పాటైన సబ్‌స్టేషన్లను మెరుగుపరిచేందుకు ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ ఏర్పాట్లు చేయనుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరా, రైతులకు పగటి పూట 9గంటల విద్యుత్ అందించాలని అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనిపై మంత్రి బాలినేని మాట్లాడుతూ
విద్యుత్ రంగం అంటే కొందరు పెట్టుబడిదారులకు సంబంధించిన అంశమనే భావన తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల్ని విద్యుత్ రంగంతో సమన్వయం చేసుకుని, భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లో 8వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇంధన శాఖదేనని తెలిపారు. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్ది, రాష్ట్భ్రావృద్ధికి కీలకమైన ఇరుసుగా నిలిపేందుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఈసందర్భంగా ప్రజలు, ఉద్యోగుల సహకారాన్ని కోరుతున్నామని మంత్రి బాలినేని వివరించారు.
*చిత్రం...మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి