ఆంధ్రప్రదేశ్‌

బీజేపీదే భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, నవంబర్ 20: రాష్ట్రంలో బీజేపీదే భవిష్యత్ అని, వచ్చే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుధీమా వ్యక్తం చేసారు. ఇక్కడ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి అలసట లేకుండా శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు అండగా నిలబడాలన్నారు. ప్రంపంచ దేశాలు గర్వించే రీతిలో భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో 18 కోట్ల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ ఖ్యాతి గాంచిందన్నారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ రాష్టల్రో జైలుకెల్లిన వ్యక్తి సీఎంగా ఉండగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత జైలుకెళ్లే అవకాశం ఉండడం దారుణమన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలతో కాలం వెళ్ళదీస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు మాట్లాడుతూ జిల్లాలో భారతీయ జనతాపార్టీ సభ్వత్వ నమోదు ఆశాజనకంగా సాగుతోందని, స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు.