ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ సమాఖ్య నూతన కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 20: చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో గత నాలుగు రోజులుగా జరిగిన అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమాఖ్య తొమ్మిదో జాతీయ మహాసభలు బుధవారంతో ముగిశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 17వ తేదీ నుంచి జరుగుతున్న జాతీయ మహాసభలకు దేశంలోని 27 రాష్ట్రాలకు చెందిన సుమారు 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభకు హాజరైన ప్రతినిధులంతా ఏకగ్రీవంగా నూతన జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. జాతీయ కమిటీ అధ్యక్షురాలిగా ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా ఏఆర్ సింధు, ఉపాధ్యక్షురాలిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జి బేబీరాణి, సంయుక్త కార్యదర్శిగా సుబ్బరావమ్మ, జాతీయ కమిటీ సభ్యులుగా హేమప్రభ, లక్ష్మీ, సుప్రజ, వాణిశ్రీ ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 8న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేలా ఈ సమావేశాల్లో కార్యాచరణ రూపొందించారు.