ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకే నడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: విభిన్న అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జయవాడ నుంచి విశాఖపట్నం వరకు 555 కి.మీ నడకకు శ్రీకారం చుట్టారు. 5 ఏఎమ్ క్లబ్ నిర్వహణలో రోటరీ ఇంటర్నేషనల్, వైజాగ్ కపుల్స్, యంగ్ ఇండియన్స్, బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్, విజయవాడ రౌండ్ టేబుల్ 68, విజయవాడ లేడీస్ సర్కిల్ 52 వంటి స్వచ్ఛంద సంస్థల నుండి 55 మంది ఔత్సాహికులను ఇందుకోసం ఎంపిక చేశారు. విజయవాడలోని అమరావతి ఫంక్షన్ హాలు నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ నడక ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు కార్యక్రమాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. 5 ఏఎమ్ క్లబ్ వ్యవస్థాపకులు కేవీటీ రమేష్ మాట్లాడుతూ విజయవాడ నుండి విశాఖపట్నం వరకు చేపట్టిన ఈ నడక గుడివాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, దిండి, రాజమండ్రి, అమలాపురం మీదుగా విశాఖపట్నం వరకు కొనసాగుతుందని తెలిపారు. సమాజంలో పెచ్చురిల్లుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో వారికి ఇతరుల నుండి ఎదురయ్యే వివిధ రకాల స్పర్శల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తామన్నారు. ఆరు రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని, దాదాపు 450 పాఠశాలల్లో 50వేల మంది పిల్లలను కలిసి వారిని చైతన్యవంతులను చేస్తామన్నారు.
*చిత్రం...విజయవాడ నుంచి విశాఖకు నడక ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు