ఆంధ్రప్రదేశ్‌

తాగునీరు అడిగితే దౌర్జన్యం చేస్తారా?: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 18: కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ప్రజలపైనే పడ్డారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. నవరత్నాలు కాదు.. తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వండి అని ప్రశ్నించిన ప్రజలపై దాడులకు దిగారని సోమవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కర్నూలు జిల్లా కాల్వబుగ్గ గ్రామస్థులు తాగునీరు కోసం అభ్యర్థించినా ఫలితం లేకపోవటంతో గ్రామస్థులే స్వయంగా బోర్ మరమ్మతులు చేసుకునేందుకు ప్రయత్నిస్తే, కొందరు వైసీపీ నాయకులు కత్తులు, కొడవళ్లతో ప్రజలపై దాడికి దిగి తలలు పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్‌ను లోకేష్ ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు. ప్రకాశం జిల్లా కోనంకి గ్రామంలో టీడీపీకి ఓటు వేశారన్న అక్కసుతో ఎస్సీ రైతులను వారి పోలాల్లోకి వెళ్లకుండా వైకాపా నాయకులు రోడ్డును తవ్వేశారన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో 108 కూత ఎక్కడా వినిపించడం లేదని లోకేష్ ఎద్దేవా చేశారు.