ఆంధ్రప్రదేశ్‌

పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి: అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించే పోలీసు అధికార్లపై ప్రైవేటు కేసులు వేస్తామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తాత్కాలిక ప్రయోజనాలకు లోబడితే పోలీసులు ఇబ్బందిపడాల్సి ఉంటుందని గుర్తించాలన్నారు. పార్టీ సమావేశాల్లో పాల్గొనడానికి మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో చింతమనేని స్వగృహానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. చింతమనేని పోరాటానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసాయిచ్చారు. అనంతరం చంద్రబాబు విలేఖర్లతో మాట్లాడారు. తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నంత అరాచక పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై తప్పుడు కేసులు పెట్టి, బెయిలు రాకుండాచేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. చింతమనేని ఏకాకికాదని, ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజీలేని పోరాటం చేస్తున్న చింతమనేని ఇతర నాయకులకు స్ఫూర్తి అని చంద్రబాబు పేర్కొన్నారు. దుగ్గిరాల వస్తున్న కార్యకర్తలను సైతం పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని, ఇది పులివెందుల కాదు, పశ్చిమ గోదావరి జిల్లా అని గుర్తుంచుకోవాలన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సైతం ఇదేవిధంగా పోలీసులు వ్యవహరించారని, ఈతీరు మార్చుకోని పక్షంలో చట్టప్రకారం వారిపై పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు. 43వేల కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడి, ప్రతీ శుక్రవారం జైలు వారంగా మార్చుకున్న వారెవరూ తమ పార్టీలో లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబునాయుడుకు నేతలు ఘన స్వాగతం పలికారు.
*చిత్రం... చింతమనేని కుటుంబాన్ని పరామర్శిస్తున్న చంద్రబాబునాయుడు