ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్‌కు దీటుగా ఆంగ్ల మాధ్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శాస్ర్తియ పద్ధతిలో ఆంగ్ల విద్యా బోధన చేపడతామన్నారు. వచ్చే ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకు అమలు చేస్తామని ఆపై వరుస వారీగా కొన సాగిస్తామన్నారు. పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం విద్యను జీర్ణించు కోలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఆధునిక సమాజంలో ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమం తప్పనిసరన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేదరికం అనుభవిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉన్నత వర్గాల వారికి కూడా ఆంగ్ల విద్యను చేరువ చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకానికి నాంది పలికారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 లోనే ఆంగ్ల విద్య అమలుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ఇంగ్లీష్ మీడియం ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెడుతున్నందున ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఆంగ్ల విద్యాబోధనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. విద్యా సంస్కరణలలో భాగంగా 1 నుంచి 6వ తరగతి వరకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలను మార్పు చేస్తామని పునరుద్ఘాటించారు. ఆంగ్ల బోధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 85వేల మంది ఉపాధ్యాయులకు గాను 68వేల మంది ఉపాధ్యాయులకు జనవరి నుంచి ఐదు నెలల పాటు ఆంగ్ల మాధ్యమంలో తర్ఫీదునిస్తామని వివరించారు.
అందుకనుగుణంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ విద్యను అభ్యసించే నాటి నుండే డైట్ కళాశాలల్లో ఆంగ్ల భాషను ఛాత్రోపాధ్యాయులకు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా భవిష్యత్‌లో ఉపాధ్యాయ వృత్తిలో ఎంపిక అవడం ద్వారా బోధన సులభతరమవుతుందన్నారు. ఇప్పటికే ఇఫ్లూ లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమర్థవంతమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించటం చారిత్రక అవసరమన్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దేందుకే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆంగ్ల విద్యా బోధనకు కులం, మతం రంగు పులమటం అవివేకమన్నారు. పేద విద్యార్థులు అంగ్ల విద్యనభ్యసిస్తే తమ రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా భావిస్తున్నాయని విమర్శించారు. దీన్ని వక్రీకరిస్తూ కొన్ని ప్రసార మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు, సలహాలిస్తే పాటిస్తామని స్పష్టం చేశారు.

*చిత్రం... మంత్రి ఆదిమూలపు సురేష్