ఆంధ్రప్రదేశ్‌

కొత్త కాంట్రాక్టు చేతికొచ్చి 15 రోజులైనా అంగుళం కదలని ‘పోలవరం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 17: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు పనులు గత అక్టోబర్ 21 నుంచి అంగుళం కూడా ముందుకు కదల్లేదు..కొత్త కాంట్రాక్టు చేతికొచ్చి 15 రోజులైంది. ప్రధాన పనులు, ఎడమ కాలువపై వంతెన పనులు, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రియంబర్స్‌మెంట్ నిధులు వస్తే తప్ప ముందుకు కదలే అవకాశం కనిపించడం లేదు. కొత్త కాంట్రాక్టు సంస్థకు సంబంధించిన లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని, మొబిలైజేషన్ ప్రక్రియలు పూర్తవుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం నిధులకు సంబంధించి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు సన్నద్ధమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు పరిశీలిస్తే మొత్తం ప్రాజెక్టు 67.09 శాతం పూర్తయింది. హెడ్‌వర్క్స్ 58.50 శాతం, మెయిన్ డ్యామ్ ప్యాకేజీ 61.06 శాతం పూర్తయింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి పనులు 86.65 శాతం, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ క్రేవిస్ ఫిల్లింగ్ కాంక్రీటు పని 79.04 శాతం పని పూర్తయింది. రేడియల్ గేట్స్ 70.06 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ 61.19 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ 34.54 శాతం పనులు పూర్తయ్యాయి. కనెక్టవిటీ ప్యాకేజీలో 39.80 శాతం, ఎడమ కనెక్టవిటీలు 28.28 శాతం, కుడి కనెక్టవిటీల్లో 56.27 శాతం, ఎడమ ప్రధాన కాలువ 91.69 శాతం, కుడి ప్రధాన కాలువ 69.96 శాతం పనులు పూర్తయ్యాయి.
మేఘా చేతికొచ్చేసరికి పనులు 1169.56 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి పనులు 1013.39 లక్షల క్యూబిక్ మీటర్లు జరిగింది. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ తదితర కాంక్రీటు పనికి సంబంధించి మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరగలాల్సి ఉండగా 30.73 లక్షల క్యూబిక్ మీటర్లు పని జరిగింది. కొత్త కాంట్రాక్టు సంస్థ 8.15 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనిచేయాల్సి ఉంది. ఎగువ కాఫర్ డ్యామ్ మొత్తం 72.56 లక్షల క్యూబిక్ మీటర్ల పనికిగాను ఇప్పటి వరకు 44.40 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. కొత్త సంస్థ 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉంది. దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి మొత్తం 26.84 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి ఉండగా పాత సంస్థ హయాంలో 9.27 లక్షల క్యూబిక్ మీటర్లు జరిగింది. కొత్తగా పనులు చేపట్టిన సంస్థ 17.57 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉంది. కుడి ప్రధాన కాలువ 177.9 కిలో మీటర్ల పొడవున తవ్వకంలో లైనింగ్ 157.510 కిలో మీటర్ల లైనింగ్ జరిగింది. ఇంకా లైనింగ్ 17.861 పూర్తి కావాల్సి ఉంది. కుడి ప్రధాన కాలువ పరిధిలో 255 స్ట్రక్చర్లకు గాను 209 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. ఎడమ ప్రధాన కాలువలో 453 స్ట్రక్చర్లకు గాని 166 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. 82.333 కిలో మీటర్ల వరకు లైనింగ్ చేయాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కొత్త సంస్థ నిర్ధేశిత లక్ష్యం అందుకోవాలంటే పనులు యుద్ధ ప్రాతిపదికన ఊపందుకోవాల్సి ఉంది.