ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ స్థలాల అమ్మకాల్ని నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబరు 17: ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నప్పటికీ పెడచెవిన పెట్టి బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ స్థలాలు విక్రయానికి పెట్టడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వౌలిక సదుపాయాలు, నవరత్నాల అమలుకు నిధుల కోసం ప్రభుత్వ స్థలాలు తెగనమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఎన్‌బీసీసీతో ఒప్పందాలు చేసుకోవడం ప్రజావ్యతిరేక చర్యేనన్నారు. బడాబాబుల ఆక్రమణల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని కాపాడాల్సిన ప్రభుత్వమే భూములను పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. ఒకవైపు పేదలకు ఇళ్ళస్థలాలు, గృహ నిర్మాణం,, భూమిలేని పేదలకు సాగుభూమి పంపిణీ కోసం భూములు లేవని చెబుతూ మరోవైపు ఉన్న ప్రభుత్వ భూములను బడాసంస్థల పరం చేయడం గర్హనీయమన్నారు. ప్రభుత్వ భూములను తెగనమ్మి మళ్లీ ప్రజాప్రయోజనాల కోసం ప్రైవేటు భూములు సేకరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ సచివాలయాలకే భూములు లేవంటున్న పాలకులు సర్కారు భూములు బేరం పెట్టడం అనాలోచితమన్నారు. బిల్డ్ ఏపీ సాకుతో సర్కారు భూములు బడాబాబుల పరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. సంక్షేమ పథకాలు, వౌలిక సదుపాయాలకు నిధులను అన్ని పక్షాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాధించుకోవాలని మధు సూచించారు.