ఆంధ్రప్రదేశ్‌

కొత్త సాంకేతికతతోనే కేరళ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 17: ఏర్పేడు వద్ద శనివారం రాత్రి కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంపై రైల్వే అధికారులు సికింద్రాబాద్ రైల్వే జీఎం గజాననమాల్యా, గుంతకల్లు డివిజన్ డీఆర్‌ఎం అలోక్‌తివారీ ప్రమాదం జరిగిన సంఘటనకు చేరుకొని విచారణ చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటలకు న్యూఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళుతున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు చిత్తూరు జిల్లా ఏర్పేడు రైల్వే స్టేషన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో పట్టాలు తప్పిన విషయం విదితమే. మామూలు బోగీల రైలు అయితే రైలు వెళుతున్న వేగంకు ఏ ఒక్క బోగీ పట్టాలు తప్పినా రైలు బోగీలు ఒక దానిపై ఒకటి ఎక్కి చల్లాచెదురు అయ్యి భారీ ప్రాణనష్టం వాటిల్లిండేది. అయితే కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు జర్మనీ దేశం నుంచి దిగుమతి చేస్తున్న ఎల్‌హెచ్‌ఎస్ బోగీలు కావడంతో ప్రతి బోగీకి ఉన్న చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉండటం వలన శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో రైల్లో ప్రయాణికులకు ఆహారం తయారుచేసిచ్చే వంట శాల (పాంట్రీకార్) బోగీ పట్టాలు తప్పడంతో భారీ శబ్ధంతో అదురును గుర్తించిన అందులోని సిబ్బంది ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలు నడుపుతున్న రైలు డ్రైవర్ వెంటనే డిస్క్ బ్రేకులు వేయడంతో అప్పటికే 80 మీటర్ల వరకు దూసుకువచ్చిన రైలు ఎక్కడికక్కడ ఆగిపోయింది. దీంతో పాంట్రీకార్ బోగీకి రైలు చక్రం విరిగిపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదాలకు గల కారణాలను కనుగొనేందుకు రీసెర్చ్ డిజైన్డ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ చేత త్వరలో విచారణ చేపట్టనున్నది. అయితే డిస్క్ బ్రేకుల వలనే భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు అంచనా వేశారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైన కేరళ ఎక్స్‌ప్రెస్ రైలును యుద్ధప్రాతిపదికన రైల్వే అధికారులు మరమ్మతులు పూర్తి చేయడంతో తిరిగి ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు యధాతథంగా బయలుదేరి వెళ్లింది. దీంతో ఈ రూట్‌పై నడవాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.