ఆంధ్రప్రదేశ్‌

బాలల హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70శాతం మంది బాలలు నివసిస్తున్నారని, వీరిలో అధిక శాతం మంది ప్రాథమిక హక్కులను పొందే విషయంలో ప్రతికూల అణిచివేతకు గురవుతున్నారని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు కృష్ణకుమార్ చెప్పారు. అందుకని బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిషన్ వారి హక్కులను ప్రోత్సహించడంలో ప్రభావం చూపుతూ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారుల మధ్య సమన్వయంతో కృషి చేస్తోందని తెలిపారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో గర్ల్స్ అడ్వకసీ అలియన్స్, హెల్ప్, రైడ్స్, టెర్రిజెస్ హోమ్స్ - నెదర్లాండ్ సంయుక్తంగా బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ‘బాలల రక్షణ కోసం కృషి చేస్తున్న బాలల సంక్షేమ కమిటీ అధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బీ రామకోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ బాలలపై నేరాలకు పాల్పడేవారికి శిక్షలు పడటంలో బాధిత బాలల సాక్ష్యం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాగే బాధితులకు నష్టపరిహారం విధానాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాలలకు సంబంధించిన చట్టాల అమలు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
*చిత్రం... సభలో ప్రసంగిస్తున్న కృష్ణకుమార్