ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి సాగే మనకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: ప్రస్తుత, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఆరోగ్య భారత్ లక్ష్యసాధన అనేది వీరి చేతిలోనే ఉందని చెప్పారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆదివారం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్న భూములను ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో ఆహార ఉత్పత్తులన్నీ విషతుల్యం అవుతున్నాయని, దీంతో ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. మన పూర్వీకులు ప్రకృతి వ్యవసాయమే చేసేవారని, రెండు దశాబ్దాల కాలం నుండి అధిక దిగుబడి పేరుతో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని రైతులకు అలవాటు చేశారన్నారు. వీటివల్ల ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడడమేకాక భూసారం క్రమేణా నిర్వీర్యం అయిపోతోందన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.50 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం జరుగుతోందని, రైతుల్లో మార్పు వచ్చిందనే దానికి ఇది నిదర్శనమన్నారు. రాష్టమ్రంతా రైతులు ప్రకృతి వ్యవసాయ చేసినప్పుడే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను చూడగలమన్నారు. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, ఉపకరణాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు ఎండనక, వాననక కష్టపడి సాగు చేస్తున్నారని, తానుకూడా వ్యవసాయ కుటుంబం నుండే వచ్చానని, రైతు కష్టాలు తనకు తెలుసని గవర్నర్ చెప్పారు. ప్రకృతి
వ్యవసాయమంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఆ పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చానని, ఈ పర్యటన తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు. దేశానికి అన్నం పెట్టేవాడే రైతు అని, ప్రపంచంలోని అన్ని వృత్తుల్లో గొప్పది పొలాలు సాగు చేయడమని చెప్పారు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలు, రైతులు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. గ్రామాభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. అలాంటి గ్రామాలు, రైతులు రూపురేఖలు మార్చేది ప్రకృతి వ్యవసాయమేనన్నారు. ప్రారంభంలో దిగుబడి కొంతమేర తగ్గినా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల కారణంగా మార్కెటింగ్ సౌకర్యాలకు కొదవ ఉండదన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు రైతే రేటును నిర్ణయిస్తారని, ఆమేరకే వినియోగదారులు కూడా కొనుగోలు చేస్తారన్నారు. ఈ దిశగా రైతులు, గ్రామసీమలు అభివృద్ధి బాటలో పయనిస్తాయన్నారు. రాష్ట్రంలోని పూర్తి విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగంతో భావితరాలను రోగాల బారి నుండి కాపాడుకుందామని పిలుపిచ్చారు. విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తన స్వగ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో పదిమందికీ స్ఫూర్తిగా నిలిచారంటూ మైనేని గణేష్ అనే యువకుడిని గవర్నర్ హరిచందన్ ప్రశంసించారు.
కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో 50 మండలాల్లోని 55 కస్టర్లలోని 18వేల 582మంది రైతులు 13వేల 387 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి జిల్లాలో చేపట్టిన చర్యలకు గాను జాతీయ స్థాయిలో అవార్డు సాధించామని, ఇది తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తమ అనుభవాలను గవర్నర్‌కు వివరించారు. కసుకర్తి కిషోర్‌బాబు మాట్లాడుతూ తన రెండెకరాల పొలంలో ఒక ఎకరంలో ధాన్యం, ఒక ఎకరంలో వేరుశనగ, కూరగాయలు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నట్లు తెలిపారు. ఘన, ద్రవ జీవామృతాన్ని తానే తయారుచేసి సాగులో వినియోగిస్తున్నానన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మోహనరావు, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జేసీ మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.
*చిత్రం... ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన వరిపొలాన్ని పరిశీలించి యువరైతు మైనేని గణేష్‌తో మాట్లాడుతున్న గవర్నర్ హరిచందన్