ఆంధ్రప్రదేశ్‌

అట్టహాసంగా వైజాగ్ మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: డిసెంబర్‌లో జరిగే నేవీడే కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న వైజాగ్ నేవీ మారథాన్‌కు అనూహ్య స్పందన లభించింది. విశాఖ సాగర తీరంలో ఆదివారం ఉదయం నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ మారథాన్‌లో 19వేల మంది పాల్గొన్నారు. తూర్పునౌకాదళం చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ ఎస్‌ఎన్ ఘోర్మడే, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి గౌతం సవాంగ్ సంయుక్తంగా ప్రారంభించారు. పర్యావరణానికి పెను ముప్పు తెస్తూ సవాలుగా మారిన ప్లాస్టిక్ వాడకం నియంత్రణ అంశంగా తీసుకుని, ఫిట్ ఇండియాను ఆవిష్కరించేందుకు ఈ ఏడాది వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించారు. చిన్న పిల్లల నుంచి వయో వృద్ధుల వరకూ ఈ మారథాన్‌లో పాలుపంచుకున్నారు. నాలుగు కేటగిరీల్లో విజేతలకు రన్ అనంతరం అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

*చిత్రం... వైజాగ్ నేవీ మారథాన్‌లో పాల్గొన్న ప్రతినిధులు