ఆంధ్రప్రదేశ్‌

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: ప్రాథమిక, మాధ్యమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో కాక మన మాతృభాష తెలుగులోనే తప్పనిసరిగా చేయాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. తెలుగు మాధ్యమంలో విద్యా బోధనపై బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఎప్పటికీ అజరామరమని గుర్తించాలన్నారు. టెక్ట్స్ వాయిస్ రికగ్నిషన్ అనువాదం వంటి సాఫ్ట్‌వేర్ ఉండగా ఆంగ్ల మాధ్యమం అవసరం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఆకస్మాత్తుగా విద్యా విధానంలో చేసే మార్పుల వల్ల సత్ఫలితాలు రావని, సమాజం - జాతి దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి జీవోను సవరించాలని సమావేశం కోరింది. తెలుగు భాషా మాధ్యమం కోరే వారితో రాష్టమ్రంతా, ఏక కాలంలో మానవహారం ప్రదర్శించాలని, ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలను మమేకం చేయాలని, తెలుగు భాషా మాధ్యమం కోరే వారు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలని తీర్మానించారు.